టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించి అందులో అనేక మూవీలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. మోహన్ బాబు ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఇప్పటికే నాని , శ్రీకాంత్ ఓదెల కాంబోలో కొంత కాలం క్రితం దసరా అనే మూవీ రూపొందింది.

మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ది ప్యారడైజ్  మూవీ ప్రమోషన్ల కోసం నాని , రాజమౌళి ని ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి , మహేష్ బాబు తో వారణాసి అనే సినిమాని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఓ భారీ ఈవేంట్ ను నిర్వహించింది. ఆ ఈవెంట్ ద్వారా ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ది ప్యారడైజ్ మూవీ కోసం నాని కూడా అలాంటి ఈవెంట్ ని నిర్వహించాలి అని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో నాని అభిమానులు ది ప్యారడైజ్ మూవీ కి అలాంటి ఈవెంట్ ను చేసి అది సక్సెస్ అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: