తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది దర్శకులుగా , నటులుగా సక్సెస్ అయిన వారు ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించి , తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకొని అలాగే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి తన దర్శకత్వంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న వారిలో రవి బాబు ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్లు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎన్నో మొవు్ లకి దర్శకత్వం వహించాడు. ఇకపోతే తాజాగా రవి బాబు  ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన తన నటన గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రవి బాబు మాట్లాడుతూ ... తెలుగు సినిమాల్లో ఓవర్ ఆక్టింగ్ చేసే వారిని మంచి నటుడు అని అంటారు. చిన్న దానికి కూడా చాలా ఓవర్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి , లౌడ్ గా రియాక్ట్ అయ్యే వారిని అద్భుతమైన నటుడు అని అంటారు. నాకు నటన రాదు అంటున్నారు అని మురారి సినిమాలో ఓవర్ యాక్టింగ్ చేశాను. 

అలాగే సంబంధం లేని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. దెబ్బకు అందరూ అబ్బా ఏం యాక్టర్ రా అని అన్నారు అని రవి బాబు తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు. రవి బాబు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే రవి బాబు తాజాగా ఏనుగు తొండం గటిక చలం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నరేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి జనాల నుండి పర్వాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మధ్య కాలంలో రవి బాబు దర్శకత్వం లో రూపొందిన చాలా సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే ఈయన వరుస పెట్టి భారీగా సినిమాలు కూడా చేయడం లేదు. ప్రస్తుతం ఈయన కెరియర్ పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే ముందుకు సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: