మరికొన్ని గంటల్లో నందమూరి బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2' సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ విడుదల నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందో అనే కన్ఫ్యూజన్ ప్రేక్షకుల్లో ఇప్పటివరకు ఉంది. మొదటి భాగం 'అఖండ' భారీ విజయాన్ని సాధించడంతో, దానికి మించి ఉండేలా రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి.
'అఖండ'లో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, 'అఖండ 2' సినిమాలో మాత్రం సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఈ మార్పు కూడా ప్రేక్షకుల్లో కొంత ఉత్కంఠను పెంచింది.
ఈ నేపథ్యంలో, 'అఖండ 2' ట్రైలర్‌కు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఆయన చేసిన వ్యాఖ్యలు ట్రైలర్‌పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ట్రైలర్ గురించి థమన్ స్పందిస్తూ, "అఖండ 2 ట్రైలర్ బ్లాస్ట్ ఆర్ బ్లాస్టర్" అని పేర్కొన్నారు. అంటే, ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని ఆయన పరోక్షంగా తెలిపారు. ట్రైలర్ విడుదల సమయానికి సరిగ్గా ముందు, "ఇప్పుడే బీజీఎం కంప్లీట్ అయింది" అని వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన పని పూర్తయిన తర్వాత ఆయన "ఓం నమః శివాయ" అంటూ శివ నామస్మరణ చేయడంతో, సినిమాలో ఆధ్యాత్మిక, మాస్ అంశాల మిశ్రమం ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోంది. చివరిగా, "నందమూరి బాలకృష్ణ గారు మాసివ్ థిస్ ఈజ్" అంటూ తన పోస్ట్‌ను ముగించారు.
థమన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, 'అఖండ 2' ట్రైలర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా, పవర్ ప్యాక్డ్‌గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా బాలకృష్ణ మాస్ ఇమేజ్, అఘోర పాత్ర తీవ్రతను ఎలివేట్ చేసే విధంగా థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ట్రైలర్ విడుదల తర్వాత 'అఖండ 2' సినిమాపై ఉన్న కన్ఫ్యూజన్ తొలగిపోయి, మరింత స్పష్టమైన అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి