ఈ ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రాలలో 'డ్యూడ్' ఒకటిగా ఉంది. ఈ సినిమా ఏకంగా ₹100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సినిమాతోనే కీర్తిశ్వరన్ దర్శకునిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

అయితే, ఈ సినిమాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ సినిమాలోని స్నేహితుల సంభాషణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "నిజమైన స్నేహితులెవరూ అలా మాట్లాడుకోరు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సినిమా మొత్తం "అర్థం పర్థం లేకుండా" ఉందని, సన్నివేశాల మధ్య "కనెక్షన్ మిస్ అయిందని" చెత్త కామెంట్లు వస్తున్నాయి. "చెత్త రీల్స్ అన్నీ ఒకచోట చేర్చినట్టుగా" ఉందని, ఇకనుంచైనా "కొంచెం మంచి సినిమాలు తీయమని" దర్శకుడికి సలహా ఇస్తూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విమర్శలు, సలహాలపై దర్శకుడు కీర్తిశ్వరన్ ఘాటుగా స్పందించారు. విమర్శించిన వ్యక్తికి గట్టిగా బదులిస్తూ "నాకు మెసేజెస్ చేసే బదులు నీ బ్రతుకేదో నువ్వు చేసుకో" అని వెటకారంగా సమాధానం ఇచ్చారు.

అయితే, ఈ విషయంలో కొందరు దర్శకుడికి మద్దతు తెలుపుతున్నారు. "విమర్శలు హద్దులు దాటితే ఇలాగే రియాక్ట్ అవుతారు" అని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 'డ్యూడ్' సినిమా.. సోషల్ మీడియా విమర్శల నేపథ్యంలో మరోసారి వార్తల్లో నిలిచింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: