ఇలాంటి హైప్ మధ్యలోనే సుజిత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసేశారు. ఓ జీ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ మొత్తం పూర్తయి, ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సినిమా గురించి అన్ని వివరాలు బయటికి వచ్చినప్పటికీ, ఒక విషయం మాత్రం సస్పెన్స్‌గా మిగిలిపోయింది — అదే హీరోయిన్ ఎవరు?
ఇప్పటి వరకు ఈ పాత్రకు అనేక పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, అధికారికంగా ఏమి ప్రకటించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు హీరోయిన్‌గా సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు సినిమా వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ ని భావించినట్లు, ఆమెకే ప్రాథమికంగా ఆఫర్ వెళ్లినట్లు కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు నాని–కీర్తి సురేష్ మధ్య ఉన్న దోస్తీ, కీర్తిపై ఉన్న మంచి అభిప్రాయం, ఆమె నటన పట్ల మేకర్స్‌కు ఉన్న నమ్మకం— వల్ల మొదట ఆమె పేరే కన్సిడర్ చేసినట్లు తెలుస్తోంది.
కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే—కీర్తి సురేష్ కూడా ఈ పాత్రకు సాయి పల్లవి మరింత సూట్ అవుతుందని సూచించినట్లు సమాచారం. సాయి పల్లవి నటన, నేచురల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇమోషనల్ సీన్లను హ్యాండిల్ చేసే తీరు— ఈ పాత్రకు మరింత అద్భుతంగా సరిపోతాయని ప్రొడ్యూసర్స్‌కు కూడా అనిపించడంతో, చివరికి డైరెక్టర్ సుజిత్ కూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకుని, హీరోయిన్‌గా సాయి పల్లవినే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. మొదటగా కీర్తి సురేష్‌ను అనుకున్న రోల్‌లో ఇప్పుడు సాయి పల్లవి ఎంట్రీ ఇవ్వబోతుందనే న్యూస్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి