ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫైనల్ చేసే దిశగా టీమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. టైటిల్ నుంచే కథలో కుటుంబ నేపథ్యం, భావోద్వేగాలు, బాధ్యతలు, వారసత్వం వంటి అంశాలు కేంద్రంగా ఉండే కథనాన్ని చూపిస్తారన్న అంచనాలు పెరుగుతున్నాయి. వెంకీ అట్లూరి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ భావోద్వేగాలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యమిచ్చే విధంగా ఉండటం వల్ల, ఈ టైటిల్ పై ఆసక్తి మరింత ఎక్కువైంది.ఈ సినిమాలో సూర్య పూర్తిగా కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ విభిన్నమైన, భావోద్వేగభరితమైన పాత్రను పోషిస్తున్నారని తెలుస్తోంది. హీరోయిన్‌గా అందాల భామ మమితా బైజు ఎంపిక కావడం కూడా ఈ సినిమాకు మరో హైలైట్‌గా మారింది. ఆమె పాత్ర కూడా కథలో కీలకమైనదిగా ఉండబోతుందని సమాచారం.
సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నాడు. సూర్య—జివి ప్రకాష్ కాంబినేషన్ గతంలో కూడా మంచి ఫలితాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా మ్యూజిక్ ఆల్బమ్ ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనేది ఇండస్ట్రీ టాక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో కూడా ఈ బ్యానర్ యునిక్ కథలు, క్వాలిటీ ప్రమాణాలతో సినిమాలు నిర్మించడం వల్ల, ఈ సినిమా నుండి కూడా ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..??
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి