ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్‌తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ‘త్రికాల’ సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.


ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, సినిమాలోని డైలాగ్స్, శ్రద్దా దాస్ మేకోవర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఒక్క ట్రైలర్‌తోనే ఏకంగా నార్త్ ఇండియాలోనూ ‘త్రికాల’  బిజినెస్ జరిగిపోయింది. ప్రస్తుతం అన్ని చోట్లా ‘త్రికాల’ మీద మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించడం విశేషం. ప్రస్తుతం స్పిరిట్, పూరి-విజయ్ సేతుపతి లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హర్షవర్దన్ రామేశ్వర్  'త్రికాల’ కథ నచ్చి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో ఆయన సౌండింగ్ స్పెషల్ ట్రాక్షన్ గా ఉండబోతోంది.


‘త్రికాల’కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం పూర్తి అయ్యాయి. ఇక మరో వైపు ప్రమోషన్స్ కార్యక్రమాల్ని కూడా పెంచే పనిలో పడ్డారు. ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత బజ్‌ను క్రియేట్ చేయాలని టీం ప్రయత్నిస్తోంది. డిసెంబర్ లో సినిమా రిలీజ్ కానుంది. నటీనటులు :  శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి,  తనికెళ్ల భరణి, సాయి దీనా  త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: