తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత పెద్ద సమస్యగా మారింది పైరసీ. ఎంతో కష్టపడి ఒక సినిమాను నిర్మిస్తే ఆ సినిమా విడుదల అయినా మొదటి రోజే ఏదో ఒక వెబ్సైట్లోకి రావడం దాని వల్ల సినిమా కలెక్షన్లు తగ్గడం జరుగుతూ రావడంతో నిర్మాతలు పైరసీ అనేది ఇలాగే కొనసాగితే తెలుగు సినిమా పరిశ్రమ ముందుకు సాగడం కష్టం అవుతుంది. భారీ బడ్జెట్ తో సినిమాలు చేయలేము. ఇలా జరిగితే సినిమా మనుగడ కూడా కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది అని అనేక మంది నిర్మాతలు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత సవాల్ గా మారిన వెబ్సైట్లో ఐ బొమ్మ వెబ్ సైట్ ఒకటి. ఈ వెబ్సైట్ ద్వారా అనేక సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంతో ఈ వెబ్సైట్ నిర్వహకున్ని పట్టుకోవడానికి పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఇక కొన్ని రోజుల క్రితమే ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు అయినటువంటి రవి ని పట్టుకున్నారు. స్వయంగా రవి చేత ఐ బొమ్మ వెబ్సైట్ ను క్లోజ్ చేయించారు.

దీనితో తెలుగు సినిమా పరిశ్రమకు పైరసీ భూతం వీడింది అనుకున్నారు. కానీ మూవీ రూల్స్ ద్వారా అది అలాగే కొనసాగుతుంది. తాజాగా మూవీ రూల్స్ వెబ్సైట్లో అనేక కొత్త సినిమాలు వచ్చాయి. దానితో దీనిని ఎలా క్లోజ్ చేయాలో తెలియక పోలీసులు కూడా సత మతం అవుతున్నట్లు తెలుస్తోంది. ఐ బొమ్మ క్లోజ్ అవ్వడంతో ఇకపై పైరసీ సినిమాలో రావు. తెలుగు సినిమా పరిస్థితి మెరుగు పడుతోంది అని అనుకున్న నిర్మాతలకు మూవీ రూల్స్ ద్వారా భారీ ఎదురు దెబ్బ తగులుతున్నట్లు తెలుస్తోంది. మరి ఐ బొమ్మ నిర్వాహకుడు అయినటువంటి రవి ని పట్టుకొని ఐ బొమ్మ వెబ్సైట్ను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇక మూవీ రూల్స్ వెబ్ సైట్ వారు మాత్రం పెద్ద ఎత్తున కొత్త సినిమాలను అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. మూవీ రూల్స్ ద్వారా నిర్మాతలకు పెద్ద గండం పొంచి ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: