మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతుండగా ... జగపతి బాబు , దివ్యాందు ఈ మూవీ లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ల వారు సంయుక్తంగా ఈ సినిమాను నేర్పిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి చిక్రి చిక్రి అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ కి విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మొదలు అయింది. ఈ సాంగ్ను ఈ మూవీ బృందం వారు చాలా భాషలలో విడుదల చేశారు.  ఇకపోతే ఇప్పటివరకు ఈ సాంగ్ విడుదల చేసిన అన్ని భాషల్లో కలిపి 16 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ ను అందుకున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇలా ఈ మూవీ లోని చిక్రి చిక్రి సాంగ్ కేవలం 16 రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను అందుకొని అద్భుతమైన రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: