ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ ఒకటి. నవీన్ , రవి శంకర్ ఈ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ నిర్మాణ సంస్థ వారు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించారు. అలాగే ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలతో , చిన్న హీరోలతో కూడా సినిమాలను నిర్మించారు. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నిర్మాణ సంస్థ వారు అనేక సినిమాలను నిర్మిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సుకుమార్ "రంగస్థలం" అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఇక సుకుమార్ "రంగస్థలం" సినిమా దగ్గర నుండి మైత్రి సంస్థ లోనే సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు.

సుకుమార్ తన తదుపరి మూవీ ని రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని కూడా మైత్రి సంస్థ లోనే నిర్మించబోతున్నాడు. మైత్రి సంస్థ వారు చరణ్ తో చేయబోయే సినిమా తర్వాత సుకుమార్ చేయబోయే సినిమాను కూడా ఈ బ్యానర్ వారే నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ , అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 అనే సినిమాలకు దర్శకత్వ వహించి అద్భుతమైన విజయాలను అందుకున్న విషయం మనకు తెలిసిందే. పుష్ప పార్ట్ 3 మూవీ ని చరణ్ మూవీ తర్వాత మొదలు పెట్టనున్నట్లు , ఆ మూవీ ని కూడా మైత్రి సంస్థ వారే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇలా మైత్రి సంస్థ వారు సుకుమార్ తో వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూ రావడానికి పెద్ద ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: