తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఆది సాయి కుమార్ ఒకరు. ఈయన ప్రేమ కావాలి అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈయన కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన లవ్ లీ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. దానితో వరుసగా రెండు విజయాలు దక్కడంతో ఈయనకు తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇక ఆ తర్వాత నుండి ఈయన ఎన్ని సినిమాల్లో నటించిన ఆయనకు మంచి విజయాలు మాత్రం దక్కడం లేదు. దానితో క్రమ క్రమంగా ఈయన క్రేజ్ చాలా వరకు పడిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన శంభాల అనే సినిమా లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ ని డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ నుండి మేకర్స్ ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడడంతో ఈ మూవీ కి మంచి బిజినెస్ ఇప్పటికే జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ హక్కులు ధరకు ఇప్పటికే అమ్ముడు పోయినట్లు , ఒక ప్రముఖ సంస్థ ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ కి సంబంధించిన ఓ టీ టీ ,  సాటిలైట్ హక్కులు  ఇప్పటికే అమ్ముడు పోయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: