కోలీవుడ్ నటుడు ధనుష్ తాజాగా తనకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఓ ప్రైవేటు ఈవెంట్లో బయటపెట్టారు. ఆ ప్రైవేట్ ఈవెంట్లో ధనుష్ చేతికి ఉన్న వాచ్ ధర హాట్ టాపిక్ గా మారడంతో వెంటనే ఆ ఈవెంట్ కి హోస్ట్ గా చేసిన యాంకర్ ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ గురించి ప్రశ్నించింది. అయితే ఈ వాచ్ లకి సంబంధించిన ప్రశ్న ఎదురైన సమయంలో ధనుష్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు.ధనుష్ ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ..నా దగ్గర ఉన్న మొత్తం వాచ్ ల విలువ దాదాపు 50 నుండి 60 కోట్ల వరకు ఉంటుంది. కానీ 50, 60 కోట్ల విలువ గల వాచ్ లు నా దగ్గర ఉన్నప్పటికీ నాకు కేవలం 100 రూపాయల విలువగల ప్లాస్టిక్ వాచ్ అంటేనే ఇష్టం.ఈ వాచ్ చిన్నప్పుడు మా అమ్మ స్కూల్ కి వెళ్లే సమయంలో కొనిచ్చింది. 

ఆ వంద రూపాయల ప్లాస్టిక్ వాచ్ ని ఇప్పటికీ భద్రంగా దాచి పెట్టుకున్నాను. అలా ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నా అమ్మ ఇచ్చింది ఎప్పటికీ ప్రత్యేకమే. అందుకే నేను ఆ ప్లాస్టిక్ వాచ్ ని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను అంటూ ధనుష్ ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులని అట్రాక్ట్ చేస్తోంది.ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ధనుష్ 100 రూపాయల వాచ్ తన దృష్టిలో ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పడం నిజంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ధనుష్ లాగే చాలా మంది సెలబ్రిటీలకు ఇలాంటి చిన్న చిన్న మెమోరీస్ ఉంటాయి.

వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్నికోట్ల ఆస్తులు సంపాదించినా చిన్నతనంలో ఇవేవీ ఆడంబరాలు లేని సమయంలో తమకి కలిగిన ఆనందాలని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. అలా ధనుష్ జీవితంలో కూడా వాళ్ళ అమ్మ ఇచ్చిన వంద రూపాయల ప్లాస్టిక్ వాచ్ చాలా ప్రత్యేకమైనది.ఇక ధనుష్ ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తూనే పర్సనల్ లైఫ్ లో కూడా హాట్ టాపిక్ గా ఉంటున్నారు. రీసెంట్గా మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ లో ఉన్నారనే విషయంలో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నారు. ఇక రీసెంట్ గా మృణాల్ ఠాకూర్ నటించిన సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైతే టీజర్ కి చాలా బాగుంది అని మెసేజ్ పెట్టడంతో లవ్ సింబల్ షేర్ చేసింది మృణాల్. దీంతో వీరి మధ్య ఉన్న రిలేషన్ పై మరిన్ని రూమర్లు వినిపించాయి

మరింత సమాచారం తెలుసుకోండి: