ఆ మూడు సినిమాలే — ‘వారణాసి’, ‘స్పిరిట్’, ‘అల్లు అర్జున్ – అట్లీ’ మూవీ. ఈ మూడు చిత్రాల పట్ల ఉన్న బజ్, అంచనాలు, హైప్ నిజంగా ఇండస్ట్రీ రేంజ్‌ను దాటి పాన్-ఇండియా, అంతకంటే ఎక్కువగా గ్లోబల్ లెవల్‌కు వెళ్లేలా కనిపిస్తున్నాయి. అందుకే చాలామంది ఇప్పుడే ధైర్యంగా “తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ గా చరిత్ర రాయబోయే సినిమాలు ఇవే” అని నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 31 కూడా అంచనాల పరంగా ముందు వరుసలో ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టైల్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ డిజైన్—అన్ని కలిపి ఈ ప్రాజెక్ట్‌కి మంచి బజ్ ఉంది. కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం వారణాసి, స్పిరిట్, అలాగే అల్లో అర్జున్–అట్లీ సినిమాలంత హై ఎక్స్పెక్టేషన్స్ ఎన్టీఆర్ 31కి ఇంకా రాలేదంటూ సోషల్ మీడియాలో ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
అయినా ఈ నాలుగు సినిమాల చుట్టూ జరుగుతున్న చర్చలు చూస్తే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ చిన్న సినిమా, మిడిల్ రేంజ్ సినిమా, నార్మల్ కమర్షియల్ మూవీ మీద కూడా పెద్దగా కన్సెంట్‌రేషన్ లేదు. అందరి దృష్టి పూర్తిగా ఈ భారీ ప్రాజెక్ట్స్ పైనే పడుతోంది.
ప్రేక్షలు, అభిమానులు, ట్రేడ్ సర్కిల్స్—అందరికీ ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. “ఇండస్ట్రీని తిరగరాయబోయే తదుపరి సినిమా ఏది?” సోషల్ మీడియాలో ఈ చర్చ రోజురోజుకూ మరింత హీట్ పుంజుకుని వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్‌ల నెక్స్ట్ మూవీస్ గురించి ఇదే టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి