కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు స్టార్ హీరోయిన్లకు కూడా హిందీ సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వచ్చేవి కాదు. ఏదో కొద్ది మంది కి మాత్రమే తెలుగు లో మంచి గుర్తింపు వచ్చాక హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. కొంత మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా తెలుగు సినిమాల్లో నటించడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇక తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారికి వరుస పెట్టి బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ జనరేషన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి రష్మిక తెలుగు సినిమాల ద్వారా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమెకి వరుస పెట్టి బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమె హిందీ సినీ పరిశ్రమలో కూడా కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు.

ఇప్పటికే ఈమె తెలుగులో ఎన్నో సినిమాలు నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ కూడా హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈమె ఇప్పటికే అక్షయ్ కుమార్ హీరోగా రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  తాజాగా టైగర్ షార్ఫ్ హీరోగా రూపొందబోయే మరో సినిమాలో కూడా హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇలా ఈ బ్యూటీ కి వరుస పెట్టి హిందీ సినిమాలలో అవకాశాలు వస్తుండడంతో ఈమె కి కూడా మంచి విజయాలు దక్కినట్లయితే రష్మిక లాగానే ఈమె కూడా హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc