డైరెక్టర్ మారుతి ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు మారుతిసినిమా చూశాక కాలర్ ఎగరవేయడం లాంటి మాటలు నేను చెప్పను.. ఎందుకంటే ఆ కటౌట్ కాలర్ ఎగరేయడం అనే మాట చాలా తక్కువ అంటూ మాట్లాడారు.అయితే మారుతి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేకపోయినప్పటికీ కొంతమంది కావాలనే ఎన్టీఆర్ ని ఇందులోకి లాగి ఎన్టీఆర్ ని మారుతి విమర్శించారు అనే విధంగా ప్రచారం చేసి సోషల్ మీడియాలో మారుతి పై నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే వార్ -2 మూవీ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ అందరూ కాలర్ ఎత్తుకుంటారు అన్నట్లుగా ఒక డైలాగ్ చెప్పారు. ఇక ఆ డైలాగ్ ని ఇప్పుడు మారుతి కాస్త విమర్శించేలా మాట్లాడి ఎన్టీఆర్ ని అవమానించారంటూ పోస్టులు చేశారు. 

దీంతో వెంటనే డైరెక్టర్ మారుతి సోషల్ మీడియా వేదికగా నేను ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడలేదు. అసలు నా దృష్టిలో అందరూ సమానమే.. నా మాటల వల్ల మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ బయటికి వచ్చి మరీ క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం సర్దుమనిగిపోయింది.అయితే తాజాగా ఈ వివాదం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ జర్నలిస్టు దాసరి విజ్ఞాన్.. ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. అసలు ఎన్టీఆర్ ని విమర్శించారు అంటూ కొంతమంది పోస్టులు చేశారు. వాళ్ళు అసలు ఎన్టీఆర్ అభిమానులే కాదు. కొంతమంది ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకునే ఫేక్ అభిమానులు.

అసలు ఆ ఈవెంట్లో మారుతి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. కొంతమంది హీరోలు మ్యానరిజం తో ఫేమస్ అవుతూ ఉంటారు. కానీ ఆ మ్యానరిజం పైన ఎవరికీ పేటెంట్ హక్కులు లేవు.ఇక ఎన్టీఆర్ కాలర్ ఎగరవేయడం గురించి మారుతి కాలర్ గురించి మాట్లాడడం గురించి చూసుకుంటే షర్ట్ కి కాలర్ అనేది ఎన్టీఆర్ పుట్టక ముందు నుండే ఉంది. కానీ మారుతి మాత్రం ప్రభాస్ కటౌట్ కి సంబంధించి మాత్రమే మాట్లాడారు. దీన్ని కొంతమంది నెగటివ్ చేశారు. అసలు ఇక్కడ మారుతి క్షమాపణ చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆయన పెద్ద మనసు చేసుకుని బయటికి వచ్చి క్షమాపణలు చెప్పారు అంటూ దర్శకుడు మారుతీ వ్యాఖ్యల్ని సమర్ధిస్తూ ఎన్టీఆర్ అభిమానులను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు దాసరి విజ్ఞాన్..

మరింత సమాచారం తెలుసుకోండి: