అబ్బాస్.. సౌత్,నార్త్ లో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయినట్లు అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో 1996లో ఈయన క్రేజ్ ఏ విధంగా ఉండేదో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి అబ్బాస్ కి ఈ సినిమా తర్వాత ఏకంగా 23 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒకప్పుడు యూత్ కి అబ్బాస్ అంటే ఫేవరెట్.. అబ్బాస్ కటింగ్,అబ్బాస్ స్టైల్ అంటూ ఆయన్ని ఎక్కువగా ఫాలో అయ్యేవారు.  అయితే అలాంటి అబ్బాస్ ఈ సినిమాతో వచ్చిన స్టార్డం ని ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయారు. కథలేని సినిమాలను ఎంచుకొని అసలు కథ కూడా వినకుండానే దర్శకులు ఎవరో కూడా తెలియకుండానే సినిమాలకు ఓకే చెప్పి ఒకే ఒక్క సినిమాతో వచ్చిన స్టార్డం మొత్తాన్ని కోల్పోయారు.చివరికి అవకాశాలు లేక వేరే దేశం వెళ్లి బ్రతకాల్సిన పరిస్థితి ఎదురైంది. అలాగే అవకాశాలు లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం హార్పిక్ యాడ్లో సైతం నటించారు. అలా నటించినప్పుడు అబ్బాస్ కి ఎన్నో విమర్శలు వచ్చాయి. 

కానీ నేను హార్పిక్ తినమని చెప్పడం లేదు బాత్రూం కోసం అనే చెబుతున్నాను. అయినా ఒక పనిని ఎగతాళి చేయడం మంచి పని కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అలాంటి అబ్బాస్ ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ నటుడు అయినప్పటికీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన్ని నిలువునా ముంచేశాయి. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరో అబ్బాస్ కి ఓ విషయంలో వెన్నుపోటు పొడిచారట.దాంతో ఆయన జీవితంలో కోలుకోలేని దెబ్బ తిన్నారట. మరి ఇంతకీ అబ్బాస్ కి వెన్నుపోటు పొడిచిన ఆ నటుడు ఎవరయ్యా అంటే తమిళ స్టార్ హీరో విశాల్..ఈ విషయాన్ని స్వయంగా అబ్బాస్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అబ్బాస్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నేను తమిళ, కర్ణాటక, తెలుగు, కేరళ నటులందరినీ ఏకం చేసి క్రికెట్ టోర్నమెంట్ ని నా సొంత డబ్బులతో ప్రకటనలు వేసి ఫైనల్ గా క్రికెట్ టోర్నమెంట్ ని నిర్వహించాను.

అన్ని భాషల్లో ఉన్న నటులను ఏకం చేయడం కష్టమే అయినప్పటికీ నా తెలివితో వారందరినీ ఏకం చేశాను. ఆ టైంలో ఆదాయం కూడా వచ్చింది. ఇక అదే సమయంలో విశాల్ నాకు వెన్నుపోటు పొడిచాడు. సిసిఎల్ నిర్వహించేది నేనైతే నా పేరు బయటకు రాకుండా ఆయనే ఈ సిసిఎల్ నిర్వహిస్తున్నట్టు బయటికి చెప్పుకున్నారు. దాంతో నేను పెట్టిన ఆదాయం కూడా నాకు తిరిగి రాలేదు. ఆదాయం లేకపోవడం పెట్టిన డబ్బు కూడా రాకపోవడంతో ఆ పోటీని నేను తట్టుకోలేకపోయాను. ఆ సమయంలో పోరాడటానికి అవసరమైన శక్తి మొత్తం నాలో ఉంది. కానీ పోరాటం కంటే సైలెంట్ గా ఉండి శాంతితో కూడిన జీవితం బెటర్ అనిపించి సైలెంట్ గా అక్కడి నుండి న్యూజిలాండ్ కి వెళ్లి పోయాను అంటూ నటుడు విశాల్ చేసిన మోసం గురించి బయటపెట్టారు అబ్బాస్. ఇక న్యూజిలాండ్ వెళ్ళాక బాత్రూం క్లీనర్ గా.. సూపర్ మార్కెట్లో వర్కర్ గా.. పెట్రోల్ బంక్ లో ఇలా ఎన్నో పనులు చేసి కుటుంబాన్ని పోషించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: