దాదాపు అంతా కొత్త వాళ్లతో రూపొందిన రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగుండడం , అలాగే ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ బృందం వారు ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని గట్టిగా ప్రచారాలు చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు పరవాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను కూడా అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ..? ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 6.15 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.35 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు రోజుల్లో ఈ మూవీ కి 3.85 కోట్ల షేర్ ... 7.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. నాలుగు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 1.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి నాలుగు రోజుల్లో 4.35 కోట్ల షేర్ ... 8.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఇప్పటికే ఈ సినిమా 1.85 కోట్ల లాభాలను అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వస్తుండడంతో ఈ మూవీ భారీ లాభాలను అందుకుని అద్భుతమైన విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: