తమిళ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటివరకు తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేశాడు. అందులో చాలా మూవీ లు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దాని తో ఈయన కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే తెలుగులో మంచి గుర్తింపు పొందిన ప్రాంచెజ్ సినిమాల్లో హిట్ సిరీస్ ఒకటి. ఇప్పటికే హిట్ సిరీస్ నుండి హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ , హిట్ ది థర్డ్ కేస్ అనే మూడు మూవీ లు వచ్చాయి. ఈ మూడు మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే హిట్ 4 మూవీ లో కార్తీ హీరో గా నటించబోతున్నాడు. హిట్ ది థర్డ్ కేస్ మూవీ చివరన హిట్ 4 మూవీ లో కార్తీ హీరో గా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే హిట్ 4 మూవీ లో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కార్తీ మరో తెలుగు దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్ మూవీలతో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తీ ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ , కార్తీ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు , అన్ని ఒకే అయితే వీరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక కళ్యాణ్ శంకర్ తన తదుపరి మూవీ ని రవితేజ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవితేజ కు కళ్యాణ్ శంకర్ ఒక కథను వినిపించగా రవితేజ , కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: