తమిళ వెర్షన్ కోసం డిస్ట్రిబ్యూటర్లు క్యూలో నిలబడ్డారంటే, తెలుగు వెర్షన్ కోసం కూడా భారీ డిమాండ్ ఏర్పడటం ఆశ్చర్యమేమీ కాదు. ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ చర్చేమంటే —“జన నాయకుడు” తెలుగు రిలీజ్ హక్కుల కోసం నాగవంశీ గట్టిగా ప్రయత్నిస్తున్నాడట!ఇది కేవలం రూమర్ కాదు… ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగవంశీ ఇప్పటికే మేకర్స్‌తో సీరియస్ మీటింగ్స్ కూడా జరిపాడట. విజయ్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసిన వ్యక్తి కూడా నాగవంశీయే. “లియో” తెలుగు రైట్స్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ తీసుకుని పెద్ద సక్సెస్‌గా మార్చింది. విజయ్ మార్కెట్ పుల్, ఫ్యాన్ బేస్, హైప్ — ఇవన్నీ ఏమాత్రం అండర్ ఎస్టిమేట్ చేయలేనంతగా పెరిగాయి. అందుకే విజయ్ లాస్ట్ మూవీ కావడంతో, ఆ రేంజ్ అవకాశాన్ని వదులుకోవడానికేమీ నాగవంశీ సిద్ధంగా లేడని టాక్.
ఇండస్ట్రీ బజ్ ప్రకారం “జన నాయకుడు” తెలుగు రైట్స్ డబుల్ డిజిట్ కోట్లలో ఉంటాయని, ప్రస్తుత నెగోషియేషన్స్ కూడా అచ్చం అదే రేంజ్‌లో జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాపై హైప్ చూసి పెట్టుబడులు కూడా రిస్క్ కాదనే భావన డిస్ట్రిబ్యూటర్లలో ఉంది.
ప్రస్తుతం మేకర్స్–సితార ఎంటర్టైన్‌మెంట్స్ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. ఒకసారి డీల్ క్లోస్ అయితే, అక్టువల్‌గా ఎప్పుడైనా భారీగా అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే…టాలీవుడ్‌లో భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్న “జన నాయకుడు” తెలుగు రిలీజ్ బాధ్యతలు కూడా సితార ఎంటర్టైన్‌మెంట్స్ చేతుల్లో పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి