అయితే ఇప్పుడు ఈ మూవీ బిజినెస్ విషయమే హాట్ టాపిక్ అయిపోయింది. ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం, కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే “ది రాజా సాబ్” 130 కోట్లకుపైగా భారీ బిజినెస్ సాధించినట్టు సమాచారం. ఇది ప్రభాస్ స్టార్ పవర్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువు చేస్తోంది.100 కోట్ల మార్క్‌ను దాటి బిజినెస్ చేయడం సాధారణంగా తెలుగులో చాలా కొద్ది సినిమాలకే సాధ్యమవుతుంది. అలాంటి లిస్ట్‌లో ఈసారి ప్రభాస్ “రాజా సాబ్” కూడా సుధీర్ఘంగా అడుగుపెట్టింది. మరీ ముఖ్యంగా హారర్ ఫాంటసీ జానర్‌లో ఈ స్థాయిలో రికార్డ్ బిజినెస్ జరగడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగానే భావిస్తున్నారు.
సంగీత విభాగంలో ఎస్ థమన్ తన మేజిక్‌ను చూపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్ ఆయన అందించిన ఎనర్జిటిక్ కంపోజిషన్‌కు నిదర్శనం. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తోంది. విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్, సీజీ వర్క్స్—అన్నీ ఒక పాన్ ఇండియా విజువల్ ఎంటర్టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. అలాగే జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం తెలుగు ప్రేక్షకులు కూడా రాజా సాబ్ కోసం భారీగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ప్రభాస్ ఏ రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ము రేపుతాడో చూడటం ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి