ఈ ఈవెంట్‌కు వచ్చే అద్భుతమైన స్పందనను గమనించి, ఇప్పుడు అదే స్ట్రాటజీని ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి అన్వయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే “డ్రాగన్” అనే టైటిల్ ఒక ఆప్షన్‌గా చర్చలో ఉన్నట్టే టాక్ వినిపిస్తోంది. అయితే, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి శంకర్ స్పష్టంచేసినట్లు, “‘డ్రాగన్’ కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. అధికారికంగా ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. ఇది పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్. ప్రశాంత్ నీల్ విజన్‌లో ఎన్టీఆర్ కొత్త అవతారం చూపబోతున్నాడు" అని పేర్కొన్నారు. టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ కూడా ‘వారణాసి’ మాదిరే ప్రాజెక్ట్‌కు తగ్గ స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబడతాయి అని క్లీయర్ గా అర్ధం అయిపోయింది.
ఈ విధంగా చేయడం ద్వారా సినిమా గ్లోబల్ ఆడియన్స్‌ను చేరుకునే అవకాశం పొందుతుంది. ‘వారణాసి’ ఈవెంట్ తరువాత, భారతీయ సినీ పరిశ్రమలో ‘టైటిల్ రివీల్ ఈవెంట్’ ఒక కొత్త ప్రమోషనల్ ట్రెండ్‌గా మారింది. అదే ఫార్మాట్‌లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అడుగులు వేస్తుండటంతో, అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. దీంతో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి