మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈమె అత్యంత తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె తెలుగు సినిమాల్లో నటించడం కంటే కూడా ఇతర ఇండస్ట్రీ సినిమాలలో నటించడంపై అత్యంత ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఈమె ఆఖరుగా కొండపొలం అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది.

రకుల్ ప్రస్తుతం తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి చాలా ఆసక్తిని చూపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజయ్ దేవగన్ హీరో గా రూపొందిన దేదే ప్యార్ డే 2 అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో ఈమె తన అదిరిపోయే రేంజ్ అందాలను కూడా ఆరబోసింది. అలాగే మంచి నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా మంచి విజయం వైపు దూసుకు పోతుంది. దానితో రకుల్సినిమా కోసం చాలా కష్ట పడింది. ఆమె కష్టం వృధా పోలేదు. ఈ మూవీ ద్వారా రకుల్ కి మంచి దక్కింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: