అయితే వీరందకి ఆన్లైన్ ఓటింగ్ ద్వారానే జరుగుతుంది. మరి కొన్ని గంటలలో ఈ ఓటింగ్ లైన్ కూడా పూర్తి కాబోతోంది. ప్రస్తుతం ఓటింగ్ సరళని బట్టి చూస్తూ ఉంటే మాత్రం కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తనూజ రెండవ ప్లేస్, మూడవ ప్లేసులో ఇమ్మాన్యుయేల్ , నాలుగో ప్లేస్ లో సంజనా, ఐదవ ప్లేసులో భరణి, ఆరో ప్లేసులో డిమాన్ పవన్, ఏడవ ప్లేస్ లో సుమన్ శెట్టి, ఆఖరి స్థానంలో దివ్య ఉన్నారు.
అయితే బిగ్ బాస్ 9 ప్రారంభమైనప్పటి నుంచి సుమన్ శెట్టి టాప్ కంటెస్టెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉండడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన ఆట మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుమన్ శెట్టి ఇప్పుడు ఓటింగ్లో వెనుక పడడంతో దివ్య తో పాటుగా డేంజర్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్య తో పాటుగా సుమన్ శెట్టి కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది మరో కొన్ని గంటలలో తేలబోతోంది. ఓటింగ్ కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి