టాలీవుడ్‌లో నెం 1 హీరో ఎవరు అంటే అందరు మొదట చెప్పే ఆన్సర్ మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత నెంబర్ 1 హీరో ఎవరు? అనే ప్రశ్నకు దశాబ్దాలుగా స్పష్టమైన సమాధానం రాలేదు. పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలందరికీ ప్రత్యేకమైన క్రేజ్, అభిమాన వర్గాలు, మార్కెట్, వ్యక్తిగత రికార్డులు ఉన్నాయి. ఈ కారణంగా ఎవరి పేరునైనా నెంబర్ 1 అని ఫిక్స్ చేయడం కష్టమవుతోంది. ప్రతి ఒక్కరిలోని ప్రత్యేకతల వల్ల చర్చలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కాలం మారింది. ఏఐ  యుగం ప్రారంభమైంది. చిన్న సమస్యల నుండి పెద్ద నిర్ధారణల వరకు ఏఐ ద్వారా సమాధానాలు లభిస్తున్న తరుణంలో… టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు? అనేది కూడా ఏఐ తేల్చేసింది. చాట్‌జిపిటి, జెమిని, గ్రోక్ వంటి ప్రముఖ ఏఐ చాట్‌బోట్లు టాలీవుడ్‌ అగ్ర హీరోలపై విశ్లేషణ చేసి తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఆశ్చర్యకరంగా, ఈ మూడు ఏఐలు కూడా యూనానిమస్‌గా టాలీవుడ్‌లో నెంబర్ 1 హీరోగా ప్రభాస్ పేరునే ప్రకటించాయి.కేవలం నెంబర్ 1 మాత్రమే కాదు… ఏఐ ప్రకారం టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ 6 హీరోలు ఎవరన్నది కూడా స్పష్టంగా బయటకొచ్చింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:


1. ప్రభాస్

2.అల్లు అర్జున్

3.మహేష్ బాబు

4.జూనియర్ ఎన్టీఆర్

5.రామ్ చరణ్

6. పవన్ కళ్యాణ్

పాన్ ఇండియా మార్కెట్‌ను తెరిచిన మొదటి తెలుగు హీరోగా నిలిచిన వ్యక్తి ప్రభాస్. ‘బాహుబలి’ సిరీస్ భారతీయ సినీ చరిత్రను తిరగరాసింది. ఆ తర్వాత ఆయన చేసిన ‘సాహో’, ‘సాలార్’, ‘ఆదిపురుష్’ వంటి భారీ చిత్రాలు ఉత్తర భారత ప్రేక్షకుల్లో ఆయనకు అపారమైన క్రేజ్‌ను తెచ్చాయి. ప్రభాస్ పేరు వస్తేనే నార్త్ ఆడియన్స్‌లో వచ్చే స్పందన ఆయన రేంజ్‌కు నిదర్శనం.అల్లు అర్జున్ ‘పుష్ప’తో నేషనల్ లెవెల్‌లో క్రేజ్ పెంచుకోగా, మహేష్ బాబు తన స్టార్డమ్‌ను స్థిరంగా కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ లెవెల్ క్రేజ్ పొందారు. పవన్ కళ్యాణ్‌కు అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ విధంగా టాలీవుడ్ టాప్ 6 హీరోలను ఏఐ విశ్లేషణ స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్‌లో సినిమాల విజయాలపై ఆధారపడి ఈ ర్యాంకింగ్స్ మారవచ్చు కానీ ప్రస్తుతానికి ఏఐ ప్రకారం టాలీవుడ్ నెంబర్ 1 స్టార్ — ప్రభాస్ అని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: