అయినా రవి హీరోగా ఎందుకు మారాడు?
ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ తానే మధ్యతరగతి ప్రేక్షకుడిని థియేటర్‌కి దూరం చేసింది.పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాక కొన్ని చోట్ల స్పెషల్ షోలు, పెంచిన టికెట్ రేట్లు, మల్టీప్లెక్స్‌లలో డబుల్ ఛార్జీలు సాధారణమైపోయాయి. ఒక హీరో – ఒక సినిమా – ఒక వారం. ఆ వారం మొత్తం టికెట్ రేట్లు ఆకాశాన్నంటడం, సింగిల్ స్క్రీన్‌లకూ అదే రేట్లు అమలు చేయడం వల్ల ఆర్థికంగా నడవడం కష్టమైపోయింది.ఒక ఫ్యామిలీ నెలలో ఒక్క సినిమా కూడా చూడలేని పరిస్థితి వచ్చింది.
కానీ ఈ సమస్య ఎప్పుడు మొదలైంది?
టికెట్ రేట్ల పెరుగుదల కొత్తకాదు. 1950ల నుంచే పెరుగుతూ వస్తున్నాయి.కానీ 2010 తర్వాత తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదగడంతో నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగాయి.దాంతో నిర్మాతలు పెట్టుబడిని తిరిగి తెచ్చుకోవడానికి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి స్పెషల్ రేట్లు పెంచించుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వం ఆపినా… ఇండస్ట్రీ లాబీయింగ్ చేసి తిరిగి పెంచించుకున్నారు.
అతిరేక ప్రమోషన్లు – వ్యర్థ ఖర్చులు
ఇప్పుడు డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు ప్రేక్షకుడి “మా హీరో కోసం ఏదైనా చేస్తాం” అనే ఫ్యాన్ భావాన్ని బిజినెస్ మోడల్‌గా మార్చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషన్లు, రోడ్డు షోలు, ట్రెండ్ హ్యాష్‌ట్యాగ్స్—ఇవి అన్నీ చూస్తే కోట్లు వృథాగా ఖర్చు అవుతున్నాయి. ఆ కోట్లు చివరికి ఎక్కడి నుంచి రికవర్ చేస్తారు? ప్రేక్షకుడి జేబు నుంచే.వాస్తవానికి నిర్మాతలు ఈ ప్రమోషన్ల మీద ఖర్చు తగ్గించి టికెట్ ధరలను సగటు స్థాయికి తీసుకొస్తే, థియేటర్లలో ప్రేక్షకులు సహజంగానే పెరుగుతారు. కానీ అది చేయకుండా, ఖర్చు మొత్తం ప్రజల మీద వేసేస్తున్నారు. అందుకే ప్రజలు “పైరసీ” వైపు మొగ్గుతున్నారు.
పైరసీ తప్పే :
పైరసీ అంటే దొంగతనం. ఎదుటివాడి కళ, తమయం, హక్కుల్ని పూర్తిగా దోచుకోవడం. టికెట్ రేట్లు అన్యాయం అనిపించినా ప్రేక్షకుడికి ఒక ఎంపిక ఉంది—చూడకపోవచ్చు. కానీ పైరసీ కోసం తన బ్యాంక్ అకౌంట్, ప్రైవసీ, సెక్యూరిటీను రిస్క్ చేస్తాడు. ఇది ఇరువైపులా నష్టం. ఈ పరిస్థితి మారకపోతే…ఈరోజు రవి అరెస్ట్ అయ్యాడు.రేపు రమేష్ వస్తాడు.ఎల్లుండి రాజా వస్తాడు. పైరసీ ఆగదు. ఆగాల్సింది – ఇండస్ట్రీ వ్యూహం. సినిమాని బిజినెస్‌గా కాకుండా కళగా చూడాలి. ప్రేక్షకుడిని కస్టమర్‌గా కాకుండా సహకర్తగా గౌరవించాలి. అప్పుడే పైరసీ ఆగుతుంది.అప్పుడే థియేటర్లు నిండుతాయి. అప్పుడే మంచి సినిమాలు బతుకుతాయి. అంటున్నారు జనాలు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి