దక్షిణాది భారత సినీ రంగంలోనే హాట్ బ్యూటీగా పేరు సంపాదించి తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో అద్భుతమైన చిత్రాలలో నటించిన హీరోయిన్ హానీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. 2008లో ఆలయం అనే తెలుగు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎక్కువగా తమిళ్, మలయాళం వంటి ఇండస్ట్రీలోని ఎన్నో చిత్రాలలో నటించింది. మళ్లీ 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో నటించిన సక్సెస్ కాలేదు. కానీ 2023లో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది హానీ రోజ్.


ప్రస్తుతం రాచెల్ అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 6న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం పాల్గొన్న హాని రోజ్ ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డాననే విషయాన్ని తెలియజేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాత్ర కోసం మాంసం కోసే వ్యక్తిగా నటించానని స్క్రీన్ మీద మాత్రమే కాదు తాను కత్తి పట్టుకొని మరి రక్తం చిందే మాంసం ముక్కలు చేయడం వంటివి నేర్చుకున్న అంటూ తెలియజేసింది


సుమారుగా ఒక ఏడు రోజులపాటు ఒక షాపులో ఉండి మాంసం కోసే ట్రైనింగ్ నేర్చుకున్నానని తెలియజేసింది. తన 20 ఏళ్ల సినీ కెరీర్లో మొదటిసారిగా తాను పూర్తి లెన్త్ టైటిల్ రోల్ చేస్తున్నానని.. ఈ పాత్రలో కనిపించడం కూడా కాస్త ఒత్తిడి గానే ఉన్నప్పటికీ, సినిమాలోని తన పాత్ర అవసరం కాబట్టి చాలా కష్టపడి సినిమాలో నటించానని తెలియజేసింది. చాలా ధైర్యం చేసి మరి ఈ సినిమా కోసం ఏం చేయాలో అది చేశానని తెలియజేసింది హానీ రోజ్. ఇందులో హనీ రోజ్ ఎవరు ఊహించని విధంగా కనిపించబోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: