ఇటీవల ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ “రోడ్డు వేయమంటే రాజమౌళి గారు ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే వేసేస్తారు” అని చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం నిజంగా అదే పరిస్థితి. రాజమౌళి ‘వారణాసి’తో వేసిన ఆ ఇంటర్నేషనల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై వెంటనే నడవాల్సిన బాధ్యత ప్రశాంత్ నీల్ మీదే ఉంది. ఎన్టీఆర్‌తో కలిసి తెరకెక్కిస్తున్న నీల్ సినిమా గురించి నిర్మాత నవీన్ యేర్ణేని కొన్ని నెలల క్రితమే ఇంటర్నేషనల్ లెవెల్ రిలీజ్ స్ట్రాటజీస్‌ను సూచిస్తూ పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు. అప్పుడు అది కేవలం ప్లాన్ లా అనిపించినా, ఇప్పుడు రాజమౌళి చేసిన కొత్త ప్రమోషనల్ రూట్‌ని దాటి వెళ్లడం అనివార్య పరిస్థితిగా మారింది.అప్పట్లో ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత ‘కేజీఎఫ్’ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ‘వారణాసి’ తర్వాతా అదే స్థాయిని క్రాస్ చేయాల్సిన బాధ్యత ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మీద ఉంది. ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి నయా ప్రమోషన్ పద్ధతులు, విభిన్న మార్కెటింగ్ పథకాలు, బడ్జెట్ స్కేల్స్, స్టంట్స్, ప్రెజెంటేషన్ల—అన్నిటిని పరిచయం చేయడంలో టాలీవుడ్ మేకర్స్ ఒకరిని మించి మరొకరు ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ ఆ రేసులో ముందుండి, అత్యంత కఠినమైన మైలురాయిని దాటాల్సినది ప్రశాంత్ నీల్.
వారణాసి తర్వాత ప్రపంచ సినిమా వర్గాలు ఇప్పుడు టాలీవుడ్‌ను కొత్త మైండ్‌సెట్‌తో పరిశీలిస్తున్నాయి. సినిమాలు ఎంత స్కేల్లో వస్తాయో కాకుండా, వాటిని ఎలా ప్రెజెంట్ చేస్తారు? ఎలా గ్లోబల్ మార్కెట్లో పుష్ చేస్తారు? ఏ రేంజ్‌లో అంచనాలను పెంచుతారు?—అన్నీ క్రిటికల్ పాయింట్స్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఆయన రూపొందించబోయే విజువల్ వరల్డ్, ఎన్టీఆర్ ఇస్తున్న గ్లోబల్ పుల్—ఇవి అన్ని కలిసి ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేస్తాయో చూడాలనేది ఇండస్ట్రీ మొత్తానికి ఉన్న కుతూహలం. మొత్తం మీద, రాజమౌళి పరోక్షంగా విసిరిన ఈ భారీ సవాల్‌ను ప్రశాంత్ నీల్ ఎలా ఎదురుకుంటారు? ఆయన దాన్ని క్రాస్ చేసి, ఆ ఎక్స్‌ప్రెస్ హైవే మీద ఇంకో లెవెల్‌కి ఎలా దూసుకెళ్తారు? అదే ఇప్పుడు టాలీవుడ్, ఇండియన్ సినిమా అభిమానులు, అలాగే ఇంటర్నేషనల్ సినిమా ఔత్సాహికులందరూ ఆసక్తిగా గమనిస్తున్న అంశం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి