టాలీవుడ్ లో ఒక స్టార్ డైరెక్టర్ పదేళ్ల పాటు తన కెరీర్‌ను మెగా హీరోలకే అంకితం చేసిన అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. 2018లో విడుదలైన రంగస్థలంతో సుకుమార్ కెరీర్ మరో లెవల్‌కు వెళ్లింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయానంతరం ఆయన పూర్తి సమయాన్ని పుష్ప ప్రాజెక్ట్‌కు అంకితం చేశారు. 2021లో పుష్ప: ది రైజ్, 2024లో పుష్ప: ది రూల్ ప్రేక్షకులను పలకరించాయి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా హంగామా సృష్టించడంతో, సుకుమార్ బ్రాండ్ విలువ మరింత పెరిగింది. ఇప్పుడు పుష్ప 3 సినిమాపై నేషనల్ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పుష్ప 2 తర్వాత సుకుమార్ చేయబోయే ప్రాజెక్టులు అధికారికంగా ఫిక్స్ అయ్యాయి. ముందుగా రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ రీ ఎంట్రీ. పెద్ది పూర్తయిన వెంటనే ఈ భారీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
రంగస్థలం తర్వాత మరోసారి సుక్కు - చరణ్ జోడీ రావడం ఆల్రెడీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత మైత్రీ రవి “ ఇది సమకాలీన కథ. రంగస్థలాన్ని మించిపోయే స్థాయిలో ఉంటుంది ” అని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. చరణ్ సినిమా పూర్తయ్యాక మళ్లీ అల్లు అర్జున్‌తో పుష్ప ఫ్రాంచైజ్లోకి అడుగుపెడతారు సుకుమార్. “ పుష్ప 3 స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే జరిగింది. అద్భుతంగా ఉంది. 2027లో సెట్స్ ఎక్కిస్తాం ” అని నిర్మాతలు క్లారిఫై చేశారు. దీంతో పుష్ప యూనివర్స్ ముగింపు మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక
2024 – 2026 మధ్యలో రామ్ చరణ్ సినిమా ఉంటుంది. 2027 – 2030 మధ్యలో పుష్ప 3 సినిమా ఉంటుంది.
ఇలా ఓ టాప్ డైరెక్టర్ డేట్ డైరీ ఏకంగా పదేళ్ల పాటు మెగా హీరోల సినిమాలకే బ్లాక్ అయ్యింది. చాలా మంది దర్శకులు ఒక సినిమా ముగిసిన తర్వాత కొత్త కాంబినేషన్ కోసం అన్వేషించాల్సి వస్తుంది. కానీ సుకుమార్‌కు మాత్రం ప్రాజెక్టులు ముందుగానే సెట్ అవ్వడం ఆయన మార్కెట్, క్రియేటివిటీ, కథలపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఏదేమైనా 2030 వరకూ సుకుమార్ రేజ్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి