హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తుండగా విలన్ పరంగా కూడా బలమైన సెటప్ ఉన్నట్టు టాక్. బోయపాటి సినిమాల్లో థమన్ సంగీతం ఎంత రోల్ ప్లే చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే రిలీజైన బీజీఎం థీమ్స్ అయితే సోషల్ మీడియాలో అదర గొట్టేస్తున్నాయి. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మేకర్స్ అఖండ 2ని 3డి ఫార్మాట్‌లో కూడా రిలీజ్ చేయడం. బాలయ్య స్టైల్లో జరిగే ఆక్షన్ సీక్వెన్సులు, బోయపాటి మాస్ విజువలైజేషన్ 3డి స్క్రీన్‌పై అంటే థియేటర్‌లో పూర్తి రోలర్ కోస్టర్ అనుభూతిని కలిగించనున్నాయి. కానీ యూఎస్ మార్కెట్ విషయంలో చిన్న ట్విస్ట్ వచ్చింది. అక్కడ మొదటి రోజు ప్రీమియర్స్ 2డి వెర్షన్‌లో మాత్రమే జరుగనున్నాయట. దీంతో 3డి ఫార్మాట్‌లో ఫస్ట్ షో చూడాలని ప్లాన్ చేసిన వాళ్లకు కొంచెం నిరాశ కలిగే అవకాశముంది.
అయితే ఆ ఆలస్యం ఒక్కరోజే ... మరుసటి రోజు నుంచే యూఎస్‌లో 3డి షోలు ప్రారంభం కానున్నాయి. కాబట్టి అక్కడున్న అభిమానులు ముందు 2డి లో ఎంజాయ్ చేసి తరువాత 3డి లో మళ్ళీ ఫుల్ మాస్ ఎక్స్‌పీరియెన్స్ పొందొచ్చు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో భారీ స్థాయిలో నిర్మితమవుతున్న అఖండ 2 తాండవం ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. అక‍్షన్, ఎమోషన్, డైలాగ్స్, ఆధ్యాత్మిక టచ్ అన్నీ రెట్టింపు రేంజ్‌లో ఉండనున్నాయని జట్టు ఇప్పటికే రుజువు చేసింది. బాక్సాఫీస్ దగ్గర మరోసారి బాలయ్య తాండవం మొదలుకానుందన్న ఉత్కంఠ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి