తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సూర్య ఒకరు. ఈయన నటుడిగా కేరిర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు సూర్య చాలా సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అడ్డుకున్నాయి. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. ఈయన నటించిన దాదాపు అన్ని సినిమాలను ఈ మధ్య కాలంలో తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈయన తెలుగు దర్శకుడు అయినటు వంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపాందుతున్న ఓ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

సూర్య ఈ మూవీ తర్వాత  మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్ మూవీల దర్శకుడు అయినటువంటి కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మరో తెలుగు సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే సూర్య ప్రస్తుతం కరుప్పు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి నెలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ కూడా అనౌన్స్ కాకముందే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓ టి టి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు , అందులో భాగంగా ఈ మూవీ విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: