గతంతో పోలిస్తే రీసెంట్ టైం లో తెలుగు ప్రేక్షకులు కాస్త కంటెంట్ బాగున్నట్లయితే చిన్న సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎన్నో ఉన్నాయి. తాజాగా తక్కువ బడ్జెట్లో రూపొందిన రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది. మరి ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ..? ఈ మూవీ ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగి , ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను క్లియర్గా తెలుసు కుందాం.

6 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 7.64 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6 రోజుల్లో ఈ మూవీ కి 4.75 కోట్ల షేర్ ... 9.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 6 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 1.24 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 6 రోజుల్లో 5.30 కోట్ల షేర్ ... 10.44 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా 2.8 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: