సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలు ఉన్న వారికే అద్భుతమైన క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని , వారే స్టార్ హీరోయిన్లుగా ఎక్కువ కాలం కొనసాగుతారు అనే వాదనను అనేక మంది అనేక సందర్భాలలో వినిపించిన దాఖలాలు ఉన్నాయి. ఇకపోతే ఎక్కువ శాతం మంచి విజయాలు ఉన్న వారికే అందం , అభినయం , నటన తో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలలో అవకాశాలు రావడం , వారు స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాక పోతే కొంత మంది విషయం లో మాత్రం ఇది రాంగ్ అని ప్రూవ్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది నటీ మణులు వరుస పెట్టి భారీ అపజయాలను అందుకుంటున్న వారికి వరస పెట్టి క్రేజీ సినిమాల్లో , స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రావడం , వారు నటించిన సినిమాలతో పెద్దగా విజయాలను అందుకోకపోయినా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొని అలాగే కెరియర్ను కొనసాగించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈమె ధమాకా అనే సినిమాలో హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలను మినహాయిస్తే ఈమె ఎన్నో సినిమాలలో నటించిన ఏ సినిమా ద్వారా కూడా ఈమెకు విజయం దక్కలేదు. కానీ ఈమె కి ఒక వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇక ఈమె ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. అలాగే అద్భుతమైన జోష్లో కేరిర్ను ముందుకు సాగిస్తుంది. ఇక ప్రస్తుతం ఈమెకి హిందీ సినీ పరిశ్రమలో అవకాశాలు భారీగా దక్కుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈమె హిందీ సినీ పరిశ్రమలో కూడా హిట్లు లేకపోయినా అద్భుతమైన రీతిలో కెరీర్ను కొనసాగిస్తుందా ..? లేక మంచి విజయాలను అందుకుంటుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: