తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ మాస్ ఈమేజ్ కలిగిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా అదిరిపోయే రేంజ్ మాస్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈయన ఎన్నో సినిమాలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. బోయపాటి శ్రీను , మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన భద్ర అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. బోయపాటి శ్రీను తన కెరియర్లో ఎక్కువ శాతం బాలకృష్ణ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే బాలయ్య , బోయపాటి కాంబోలో సింహా , లెజెండ్ , అఖండ అనే మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం వీరి కాంబో లో అఖండ 2 అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా బోయపాటిసినిమా ఈవెంట్లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా బాలయ్య తో సినిమా అంటే ఎలా ఉంటుంది ..? తన ఇతర మూవీ లకు , బాలయ్య సినిమాకు మధ్య తేడా ఏమిటి అనే విషయాన్ని బోయపాటి శ్రీను తాజాగా చెప్పుకొచ్చాడు. తాజాగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ ... నేను చాలా సంవత్సరాల క్రితం భద్ర అనే సినిమా చేశాను. ఆ సినిమాలో ఓ సన్నివేశంలో 16 తాటి చెట్ల మధ్య నుండి 8 సుమాలు ఒక్క సారిగా గాలిcలోకి లేస్తాయి. అంతకు ముందు అలాంటి సీన్ ఎవరు చేయలేదు. నేను భద్ర సినిమాలో చేశారు. ఇక బాలకృష్ణ గారితో సినిమా అంటి అది వేరే రకం. ఆయనతో సినిమా అంటే పూర్తిగా వేరే ట్రాక్ లో ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి అఖండ 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: