తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉంది. దానితో ఈయన నటించిన ఫ్లాప్ సినిమాలకు కూడా మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీ లలో విజయ్ దేవరకొండ నటించిన మూడు మూవీలు ఉండడం విశేషం. ఇక ఆ మూడు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర విజయాలను సాధించలేక పోవడం విశేషం. మరి నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవి ..? అందులో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు ఎన్ని కోట్లతో ఏ స్థానాలలో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

నాని హీరో గా రూపొందిన దసరా మూవీ నైజాం ఏరియాలో మొదటి రోజు 6.75 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ఖుషి మూవీ 5.12 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక నాని హీరో గా రూపొందిన హిట్ 3 మూవీ 5.10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన కింగ్డమ్ మూవీ 4.86 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 4.36 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉండగా ... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 4.20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఆరవ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd