ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్లో టాలీవుడ్ హీరోల హవా ఎక్కువగానే కనిపిస్తోంది. దీంతో తెలుగు దర్శకులే కాకుండా ఇతర భాష దర్శకులు కూడా టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ తో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో తమ మార్కెట్ ని విస్తృతంగా విస్తరింపజేసేలా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల చేతిలో సినిమా లైనప్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయబోతున్నారు. వచ్చేయేడాది జనవరి 9న రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో వారణాసి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో తన 22వ సినిమాని చేస్తున్నారు. అలాగే మలయాళ డైరెక్టర్ జోసెఫ్ తో  సినిమా చేసేలా ప్లాన్ చేశారు.


రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్ తో తదుపరి చిత్రాన్ని చేసేలా ప్లాన్ చేశారు రామ్ చరణ్.


జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ త్రివిక్రమ్ తో మరొక సినిమాని, తమిళ డైరెక్టర్ నెల్సన్ డైరెక్షన్లో ఒక సినిమా చేసేలా ప్లాన్ చేశారు. అలాగే దేవర 2 సినిమా కూడా ప్లాన్ చేశారు.


పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆ తర్వాత OG 2 సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: