సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైతే మంచి విజయాలు దక్కుతాయో వారికి వరుస పెట్టి క్రేజీ సినిమాలలో , స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తాయి అని అనేక మంది అభిప్రాయ పడుతూ ఉంటారు. కానీ కొంత మంది కి నటించిన సినిమాలతో అద్భుతమైన విజయాలు దక్కి , ఆ సినిమాలలో వారు అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా కూడా కొంత మంది కి వరుస పెట్టి క్రేజీ సినిమాలలో స్టార్ హీరోల సినిమాలలో పెద్దగా అవకాశాలు దక్కవు. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకున్న బ్యూటీలలో రెబా మోనిక జాన్ ఒకరు. ఈమె కొంత కాలం క్రితం శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సమజవరగమన అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి వరుస పెట్టి క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమెకు ఆ స్థాయి అవకాశాలు మాత్రం దక్కలేదు. 

ఇక సామజవరగమన సినిమా విడుదల అయిన చాలా కాలం తర్వాత ఈమె మ్యాడ్ స్క్వేర్ మూవీ లో ఓ ఐటమ్ సాంగ్ నటించింది. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ చేసిన ఐటమ్ సాంగ్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈమెకు మంచి అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది భావించారు. కానీ మ్యాడ్ స్క్వేర్ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా తర్వాత కూడా ఈమెకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దానితో చాలా మంది ఈమె ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నట్టు ఉంది. అందుకే పెద్దగా ఈమె సినిమాలు చేయడం లేదు. లేకపోతే ఈమె చాలా సినిమాల్లో అవకాశాలను దక్కించుకోలేదు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rmj