ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు ప్రేక్షకుల్లో మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి. అయితే, ప్రస్తుతం విడుదలైన టీజర్ ఈవెంట్‌కు హీరో సుడిగాలి సుధీర్ హాజరుకాలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో “సుధీర్ సినిమాకు సపోర్ట్ చేయట్లేదా?”, “సుధీర్-డైరెక్టర్ మధ్య ఏం జరిగింది?” వంటి వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో నిర్మాత మొగళ్ల చంద్రశేఖర్ స్పందిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. “సుధీర్ చాలా బాధ్యత ఉన్న వ్యక్తి. చాలా మంచివాడు. కిందస్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనను హీరోగా ఒప్పుకున్నాం. అతనిపై మాకు నమ్మకం ఉంది. ఇప్పటివరకు సుధీర్ చేసిన ఏ సినిమాతో పోల్చినా, ‘గోట్’ బడ్జెట్ చాలా భారీది. ఈ స్థాయి ప్రాజెక్ట్‌లో అతను తన శక్తిమేరకు న్యాయం చేస్తాడు అనుకుని కామిట్ అయ్యాం” అని చెప్పారు.
అలాగే, ఆయన కుటుంబ నేపథ్యం కూడా చాలా మంచి దని, పని మీద కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి అని పొగిడారు. “సుడిగాలి సుధీర్ గారు త్వరలోనే ప్రస్తుతం ఉన్న వివాదాలను క్లియర్ చేసుకొని ప్రమోషన్స్‌లో పాల్గొంటారని నమ్ముతున్నాను. ఆయనకు డైరెక్టర్‌తో కొంత వ్యక్తిగత సమస్య ఉన్నట్లు తెలుసుకున్నాం. అలాంటి చిన్నచిన్న విభేదాలు పెద్ద సినిమాల్లో వస్తుంటాయి. అవి సెట్ అవ్వడానికి కొద్దిగా సమయం పడుతోంది అంతే” అని వెల్లడించారు. అంతేకాదు మీడియా ముందె చెప్పుకొస్తూ.." సుధీర్ గారు ఇది మీ మూవీ..మీరు ప్రమోషన్స్ కి రావాలి.. అది మీ బాధ్యత " అంటూ చెప్పుకొచ్చారు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి