కొత్త నియమాల ప్రకారం—సినిమా థియేటర్లలో బాగా ఆడితే, ముందే నిర్ణయించిన ఒప్పంద రుసుముపై అదనంగా 25% బోనస్ అమౌంట్ నిర్మాతలకు చెల్లించబోతోంది ఓటీటీ సంస్థలు.సినిమా ఊహించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతే, ముందస్తు ఒప్పంద విలువ నుంచి 25% మొత్తాన్ని తగ్గించుకునే హక్కు ఓటీటీలకు ఉంది.ఈ కొత్త మోడల్‌ను మొదటిగా అమలు చేయబోతున్న ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్. ఈ రెవెన్యూ-బేస్డ్ స్ట్రక్చర్‌ను ఫాలో చేయబోయే తొలి భారీ చిత్రం “అఖండ 2” గా నిలిచింది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఇప్పటికే విడుదలకు రెడీగా ఉంది. చిత్ర యూనిట్ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌తో కొత్త షరతుల ఆధారంగా డీల్ ఫైనల్ చేసినట్టుగా సమాచారం.
ఇకపై ‘అఖండ 2’ థియేటర్లలో ఎంత బలంగా ఆడుతుందో, కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఆధారపడి, ఓటీటీ రాబడి కూడా నిర్ణయించబడనుంది. ఈ కారణంగా దర్శకనిర్మాతలు సినిమాపై మరింత నమ్మకంతో, మరింత కేర్‌తో పని చేసినట్టు తెలుస్తోంది.
మొత్తానికి—థియేటర్ ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఓటీటీ డీల్స్‌ను లెక్కించే కొత్త పద్ధతి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇకపై చిన్న సినిమా కావచ్చు, భారీ చిత్రం కావచ్చు—ఓటీటీ ఆదాయం కూడా బాక్సాఫీస్ పనితీరుపైనే ఆధారపడే కాలం మొదలైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి