టాలీవుడ్ ,మాలీవుడ్ లో హీరోయిన్గా పేరు సంపాదించిన పూర్ణ. తన పాత్ర బాగుంటే ఎలాంటి పాత్రలోనైన సరే నటించడానికి సిద్ధంగానే ఉంటుంది. మొదటిసారిగా 2007లో శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. కానీ సీమటపాకాయ్, అవును, అవును2, అఖండ తదితర చిత్రాలలో నటించి భారీగానే పాపులారిటీ సంపాదించుకుంది. ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెర పైన డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించేది. కెరియర్ హ్యాపీగా సాగుతున్న సమయంలో 2022లో దుబాయ్ కి చెందిన బిజినెస్ మ్యాన్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది.


అనంతరం ఒక బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టేసింది. అలా ఇప్పుడు ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్న పూర్ణ తన చిన్న వయసు నుంచే శాస్త్రీయ నృత్యకారిణి అన్న సంగతి చాలామందికి తెలియదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే పూర్ణ మంచి డాన్సర్. నటిగా మారిన తర్వాత డాన్స్ కు దూరమైనప్పటికీ తాజాగా తన జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటన ఇది అంటూ తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది.


చాలా ఏళ్ల తర్వాత శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఇవ్వడంతో తన అనుభవాన్ని పంచుకున్న పూర్ణ తన భర్త గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. తన అనుభూతిని ఇంస్టాగ్రామ్ లో తెలియజేస్తూ మా అమ్మ కృషి ప్రోత్సాహం వల్లే తాను డాన్సర్ గా ఎదిగానని, వివాహం అనంతరం మా అమ్మ లాగా నా నృత్యానికి మద్దతిచ్చే భాగస్వామి కావాలని ఆ దేవుడిని కోరుకున్నాను, తాను కన్న కలలను నెరవేరేలా చూసే వ్యక్తి నాకు భర్తగా రావాలని మా అమ్మ నన్ను ఆశీర్వదించింది.. మా ఇద్దరి కల ఆ భగవంతుడు నిజం చేశారని. తనకు మద్దతుగా నిలుస్తూ కులం, నేపథ్యం తేడాలు పట్టించుకోకుండా ఒక నిజమైన మనిషిగా ప్రేమగా గౌరవం చూపించే ఆయన మంచి మనసుకు తాను ధన్యురాలు అంటూ ఎమోషనల్ గా భర్త గురించి పోస్ట్ చేసింది పూర్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: