కోలీవుడ్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ అన్నగారు వస్తారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒకరోజు పోస్ట్ పోన్ అయిందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నలన్ కుమారస్వామి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.
కార్తీ మాట్లాడుతూ విభిన్నమైన కథలు చేయడానికి కావాల్సిన ధైర్యం నటుడికి ఉండాలని నేను నమ్ముతానని తెలిపారు. అలాంటి ప్రయత్నాలు చేసినప్పుడే నటుడిగా ఎదిగేందుకు ఛాన్స్ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. సక్సెస్ సాధించామా లేదా అనేది కాదని ప్రయత్నం చేశామా లేదా అనేది ముఖ్యమని ఆయన తెలిపారు. నేను అలా చేయడం వల్లే కార్తీ అంటే ఊపిరి, ఖైదీ సినిమాలు గుర్తొస్తాయని ఆయన అన్నారు.
అన్నగారు వస్తారు మూవీ కూడా అలాంటి ప్రయత్నమే అని కార్తీ కామెంట్లు చేశారు. ఈ సినిమా సూపర్ హీరో సినిమా అని ఈ సినిమా కాల్పనిక ప్రపంచంలో సాగే గాథ అని ఆయన అన్నారు. తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచులు,లైఫ్ స్టైల్ వేర్వేరు కాదని ఆయన అన్నారు. ఈవారం అఖండ2 వస్తుందని అఖండ2 సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. నేను బౌండెడ్ స్క్రిప్ట్ తో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తానని ఆయన తెలిపారు. ఖైదీ2 ఎప్పుడు వస్తుందనేది నాకు కూడా తెలియదని ఆయన తెలిపారు. సినిమా సినిమాకు కార్తీ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి