బాల‌కృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా సెకండాఫ్ మొదలయ్యాక ప్రేక్ష‌కుల్ని అస్స‌లు ఊపిరి తీసుకోనివ్వకుండా చేసిన ఆ 40 నిమిషాల పాటు తెర మీద జ‌రిగిన యాక్ష‌న్ విధ్వంసం మామూలుగా లేదు. ఫైట్లు, ఛేజింగ్‌లు, భారీ సెట్టింగుల్లో చేసిన పోరాటాలు... ప్ర‌తి సీన్ కూడా ఫ్యాన్స్‌కు, మాస్ ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించ‌డంలో వంద శాతం స‌క్సెస్ అయింది. బాల‌య్య స్క్రీన్ ప్రెజెన్స్, బోయ‌పాటి సీన్ల‌ను డిజైన్ చేసిన తీరు క‌లిసి ఆ సెకండాఫ్ ఆరంభాన్ని ఒక రేంజ్‌కి తీసుకెళ్లాయి.

ముఖ్యంగా బాల‌య్య - బోయ‌పాటి మార్కు మాస్ ఫైట్లు కోరుకునే వారికి ఈ భాగం ఒక పండుగలా అనిపించింది. యాక్ష‌న్ సన్నివేశాల‌లో బాల‌య్య చూపించిన ఎనర్జీ, డైలాగ్ డెలివ‌రీ థియేట‌ర్‌ల‌లో ఈల‌లు వేయించాయి. ఇందులో లాజిక్‌లు, క‌థా క‌మామిషు ప‌క్క‌న పెట్టి కేవ‌లం బాల‌య్య మాస్‌ ఇమేజ్‌ని, యాక్ష‌న్‌ను మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది.

ఈ యాక్ష‌న్ సన్నివేశాల‌కు వెన్నుముక‌గా నిలిచింది థ‌మ‌న్ సంగీతం. ఆయ‌న అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) యాక్ష‌న్‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. ప్ర‌తి పంచ్‌కు, ప్ర‌తి డెడ్లీ షాట్‌కు థ‌మ‌న్ బీజీఎం ఒక అద‌న‌పు ప‌వ‌ర్‌ను జోడించింది. తెర‌మీద జ‌రుగుతున్న యాక్ష‌న్ తంతుకు బీజీఎం తోడు కావ‌డంతో, ప్రేక్ష‌కులు క‌ళ్ల‌ప్ప‌గించి చూడ‌డం మిన‌హా మ‌రేం చేయ‌లేని ప‌రిస్థితి. ఆ 40 నిమిషాల పాటు థియేట‌ర్‌లో ఒకటే మోత‌గా, మాస్ హంగామాగా మారిపోయింది. లాజిక్‌ల‌ను ఇంటి వ‌ద్ద వ‌దిలేసి వ‌చ్చిన వారికి, కేవ‌లం మాస్ యాక్ష‌న్ కావాల‌నుకునే వారికి ఈ భాగం ఒక ట్రీట్ అని చెప్ప‌వ‌చ్చు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: