బాలయ్య నటించిన అఖండ 2 - తాండవం సినిమా ఎట్టకేలకు థియేటర్ల లోకి వచ్చేసింది. ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా మిక్స్ డ్ టాక్ అయితే నడుస్తోంది. సినిమాలో ప్లస్‌లు, మైనస్‌ల లెక్కలు ఏంటి ? అని చూస్తే ఫస్టాఫ్ మరీ అంత గొప్పగా లేదు.. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు అసలు కథలోకి వెల్లలేం. డిస్ కనెక్ట్ అవుతూ ఉంటాం. చూడడానికి పార్టులు పార్టులుగానే బాగుంటుందే తప్పా .. సినిమాగా మనం ఎక్కడా కనెక్ట్ కాలేకపోతుంటాం. ఫస్టాఫ్‌లో బాలయ్య కన్నడ, తమిళ, మరాఠి భాషల గురించి చెప్పిన డైలాగులు ఈ సినిమా ను ఆ ప్రాంతాల వారికి కూడా కనెక్ట్ చేసే ఉద్దేశంతో రాసుకున్నవే అని తెలుస్తుంది. సీమ గురించి చెప్పిన డైలాగులు, జాజాకాయ .. జాజికయ సాంగ్ ..
ఇంటర్వెల్ బ్యాంగ్ , థమన్ అద్భుతమైన బీజీఎం సినిమాను నిలబెట్టాయి.
అలాగే సినిమా స్టార్టింగ్ తో పాటు మెంటలెక్కించి... పూనకాలు లోడ్‌చేసిన థమన్ మాస్ బీజీఎం , ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్‌తో పాటు బాలయ్య హైందవ ధర్మం గురించి చెప్పిన డైలాగులు సినిమాకు ప్లస్ అవుతాయి. బాలయ్య ఎలివేషన్లు.. భారీ యాక్షన్ ఘట్టాలు.. మాస్ డైలాగ్స్.. బాలయ్య ఫ్యాన్స్‌కు పిచ్చపిచ్చగా నచ్చుతాయి. అఘోరా పాత్ర కనిపించిన ప్రతిసారీ ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా బోయపాటి సీన్స్ ను డిజైన్ చేశాడు. మాస్ ప్రేక్షకులకు మాత్రం గూస్ బంప్స్ మోతతో ఎంజాయ్ చేస్తారు.
ఇక మైనస్‌ల విసయానికి వస్తే చాలా బోరింగ్ సీన్లు, వీక్ స్టోరీ , ఫస్టాఫ్ ప్లాట్ నెరేషన్ తో పాటు సాగదీత సీన్లు ఉన్నాయి. కొన్ని కీలక సీన్లు మరీ సినిమాటిక్ అయిపోయాయి. బోర్డర్ దాటేసిన హీరోయిజం, అతికే అతిగా అనిపించిన సీన్లు , కథనం అనేక సమస్యల చుట్టూ తిరగడం.. ఎమోషన్ సరిగా కనెక్ట్ కాకపోవడం, మెయిన్ ప్లాట్‌లో కాన్ ఫ్లిక్ట్ సరిగ్గా కుదరకపోవడం మైనస్. భారీ విజువల్స్ తో వచ్చే హైయాక్షన్ సీన్లు ఆకట్టుకున్నా యాక్షన్ సీక్వెన్సెస్ లో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయాడు బోయపాటి. విలన్లు వీక్‌గా కనిపిస్తారు. విలన్లకు, బాలయ్యకు మధ్య బలమైన సంఘర్షణలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి