భాగ్యశ్రీ బోర్సే.. ప్రస్తుతం జెట్ స్పీడ్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న పేరు.  సూపర్ హాటెస్ట్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె నటించిన సినిమాలు బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాపులు అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారైనా ఆమె అవకాశాల విషయంలో వెనుక అడుగు వేయలేదు.  కానీ ఆఫర్లు మాత్రం చేతిలో  ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి, ప్రస్తుతం ఆమె చేతిలో  ఆరు సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. . బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ ఉన్న హీరోయిన్ చేతిలో ఆరు సినిమాలు ఉండటం అంటే మామూలు విషయం కాదు.


లెటేస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్‌లో భాగ్యశ్రీ హ్యాండ్ ఉంటుందని వినిపిస్తోంది. అయితే, తాజాగా భాగ్యశ్రీ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుందనే వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది.  ఆమె ఫ్యాన్స్ కోసం ఈ పని చేయడానికి రెడీ అయ్యిందట. ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టని హీరోయిన్, ఐటం సాంగ్ లో ఎలా ఓకే చేసింది అని జనాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.



కొంతమంది మాత్రం భాగ్యశ్రీ అందాలు, ప్రతిభ వేరే లెవెల్‌లో ఉన్నాయి, హిట్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఘాటుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. కానీ వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం, భాగ్యశ్రీ బోర్సే త్వరలోనే ఓ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని టాక్. అదేవిధంగా, ఇది బిగ్ పాన్ ఇండియా స్టార్ సినిమా అంటూ తెలుస్తుంది.  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందని తెలుస్తోంది. భాగ్యశ్రీ రేంజ్, స్టైల్, ప్రెజెన్స్ అంతా వేరే లెవెల్‌లో ఉన్నట్టు ఫ్యాన్స్ హర్షిస్తున్నారు. అసలు, ఇంత బోల్డ్ నిర్ణయం తీసుకున్న భాగ్యశ్రీ మామూలు ముదురు హీరోయిన్ కాదని, తన కెరీర్‌లో కొత్త చాప్టర్ ప్రారంభిస్తోందని సోషల్ మీడియాలో ఘాటుగా కౌంటర్స్ మరియు పొగడ్తలు వ్యక్తమవుతున్నాయి. .

మరింత సమాచారం తెలుసుకోండి: