బ్లాక్ అనార్కలీలో రాయల్ లుక్
అనసూయ తాజాగా బ్లాక్ కలర్ అనార్కలీ డ్రెస్ ధరించి చేసిన ఫోటోషూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ అవుట్‌ఫిట్‌లో ఆమె చాలా క్లాసీగా, రాయల్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఫుల్ హ్యాండ్స్, ఫ్లోర్ లెంగ్త్ ఉన్న ఈ బ్లాక్ డ్రెస్ నిండా రంగురంగుల ప్రింట్స్ ఉన్నాయి. ఇది ఆమెకు పక్కా ట్రెడిషనల్ వైబ్స్ ఇస్తూ అచ్చం బాపు బొమ్మలా కనిపించేలా చేసింది. ఈసారి హెవీ మేకప్ జోలికి వెళ్లకుండా, అనసూయ చాలా న్యాచురల్ లుక్‌ను ఎంచుకున్నారు. పెద్ద సైజు వెండి జుంకాలు, చేతి వేళ్లకు రింగులు, లూజ్ హెయిర్‌తో చాలా క్యూట్ ఫోజులిచ్చారు.సింపుల్ హీల్స్, లైట్ లిప్‌స్టిక్‌తో తన స్టైల్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ గ్లామర్ వైబ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసినా, ఇప్పుడు నటిగా అనసూయ రేంజ్ పూర్తిగా మారిపోయింది. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా, 'పుష్ప'లో దాక్షాయణిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల మనసులో బలంగా నాటుకుపోయాయి.
స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ కథలతో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతి నిండా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.అనసూయ కొత్త లుక్‌ను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె ఫోటోలపై "స్టన్నింగ్", "బ్యూటిఫుల్", "క్రేజీ వైబ్స్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వయసు పెరుగుతున్నా ఆమెలోని గ్లామర్, ఎనర్జీ మాత్రం అస్సలు తగ్గట్లేదని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
వెస్ట్రన్ వేర్ అయినా, ట్రెడిషనల్ వేర్ అయినా తనదైన స్టైల్‌తో ట్రెండ్ సెట్ చేయడం అనసూయకు వెన్నతో పెట్టిన విద్య. ఈ బ్లాక్ అనార్కలీ షూట్‌తో ఆమె మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌ను నిరూపించుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి