ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన రోజు నుంచే సోషల్ మీడియాలో, ఫ్యాన్ పేజీల్లో, సినీ వర్గాల్లో ఈ సినిమాపై హైప్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. అయితే సినిమా నుంచి అధికారికంగా పెద్ద అప్డేట్ రావడం మాత్రం ఆలస్యమవుతోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఓపిక రోజు రోజుకీ తగ్గిపోతోంది.ఇలాంటి సమయంలో తాజాగా వినిపిస్తున్న ఒక అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఒక కీలకమైన స్పెషల్ రోల్ ఉందని, ఆ పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఉంటుందని సమాచారం. ఈ న్యూస్ బయటికి రాగానే బన్నీ ఫ్యాన్స్‌లో మిక్స్‌డ్ రియాక్షన్స్ మొదలయ్యాయి.

టైగర్ ష్రాఫ్ నిజంగానే ఈ సినిమాలో నటిస్తున్నాడా? నటిస్తే ఆయన పాత్ర ఎంతవరకు కథకు కీలకం అవుతుంది? అసలు హీరో అల్లు అర్జున్‌కు ఈ గెస్ట్ రోల్ ఎంతవరకు ఇంపాక్ట్ కలిగిస్తుంది?అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో తిరుగుతున్నాయి.అట్లీ స్క్రిప్ట్‌లో ప్రత్యేకత… ఇదివరకు ఎప్పుడూ లేనట్టు? ఇప్పటి వరకు అట్లీ తెరకెక్కించిన సినిమాలన్నింటికీ మించి ఈ సినిమా స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందట. మాస్, ఎమోషన్, యాక్షన్ అన్నింటినీ కొత్తగా మిక్స్ చేసి కథను డిజైన్ చేశాడని టాక్. ముఖ్యంగా ఈ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ కథ తిరుగుతుందట. అల్లు అర్జున్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, ఇంటెన్స్ షేడ్స్‌తో ఉంటుందని సమాచారం.

బన్నీ కోసం అట్లీ ప్రత్యేకంగా ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్క్‌ని డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఇప్పటివరకు అల్లు అర్జున్ చేసిన పాత్రలకు భిన్నంగా, పూర్తిగా కొత్త డైమెన్షన్‌లో బన్నీని చూపించబోతున్నాడట అట్లీ. అందుకే ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. హీరోయిన్ల లిస్ట్ చూస్తేనే షాక్!..ఈ సినిమాలో హీరోయిన్ల లిస్ట్ కూడా మరో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పడుకోణె, మృణాల్ ఠాకూర్,జాన్వీ కపూర్..హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముగ్గురు టాప్ హీరోయిన్లను ఒకే సినిమాలో పెట్టడం అంటే ఇది పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్ అని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇంతమంది హీరోయిన్లు, అంతేకాదు గెస్ట్ రోల్స్ అంటూ వరుసగా పేర్లు బయటికి రావడంతో ఫ్యాన్స్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గెస్ట్ రోల్స్ ఎక్కువైపోతున్నాయా?

సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్‌ను డిజైన్ చేస్తున్నాడట. అందులో భాగంగా ఓ కోలీవుడ్ స్టార్‌ను చూపించబోతున్నారనే టాక్ ఇప్పటికే ట్రెండ్ అవుతోంది. కార్తి  పేరు అందులో ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఫ్యాన్స్ అంటున్న మాట ఒక్కటే —“ఇది అల్లు అర్జున్ సినిమా… గెస్ట్ రోల్స్ సినిమా కాదు!”..ఇప్పటికే చాలా మంది స్టార్స్‌ను గెస్ట్‌లుగా తీసుకొస్తున్నావ్ అంటూ అట్లీపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అయితే మరింత గట్టిగా స్పందిస్తూ,“సినిమా హీరో కన్నా గెస్ట్ రోల్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావ్”..“మా బన్నీ ఓపికని పరీక్షిస్తున్నావ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


మొత్తానికి ఈ సినిమా చుట్టూ అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు భారీ హైప్, మరోవైపు ఫ్యాన్స్‌లో అసహనం — ఈ రెండింటి మధ్య అట్లీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి. ముఖ్యంగా గెస్ట్ రోల్స్ విషయంలో ఫ్యాన్స్‌ను సంతృప్తిపరిచేలా అట్లీ ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.ఇప్పటికైతే అధికారిక అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో, టైగర్ ష్రాఫ్ నిజంగానే ఈ సినిమాలో కనిపిస్తాడో లేదో తెలియాలంటే మేకర్స్ నుంచి వచ్చే క్లారిటీ వరకూ వేచి చూడాల్సిందే.చూడాలి మరి… ఈ అట్లీబన్నీ సినిమా చివరికి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో!  

మరింత సమాచారం తెలుసుకోండి: