- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కోలీవుడ్కోలీవుడ్ హీరో విజయ్థా నాయకుడిగా నటించిన 'జన నాయగన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా పరాజయం పాలవడంతో పంపిణీదారులు భారీ నష్టాలను చవిచూశారు. పంపిణీదారుల కష్టాలను గుర్తించిన సినిమా యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పంపిణీదారులకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏకంగా 60 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని (రీఫండ్) నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ సినీ చరిత్రలో ఒక సినిమా వాయిదా ప‌డిన‌ప్పుడు ఇంత భారీ మొత్తంలో డబ్బును తిరిగి పంపిణీదారులకు ఇవ్వడం ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.


ఇక ఈ సినిమా రిలీజ్ విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో తీర్పు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. అయితే, ఇప్పటికే విదేశాల్లో, ఇండియాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. విజ‌య్ త‌న‌కు చివ‌రి సినిమా ఇదే అని ... ఇక‌పై తాను సినిమాల‌లో న‌టించ‌ను అని రాజ‌కీయాల్లో కొన‌సాగుతాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే జ‌న నాయ‌కుడు సినిమా పై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే సెన్సార్ పూర్తికాకముందే టికెట్లు అమ్ముడవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు.


ఇక సినిమా వాయిదా ప్రకటనకు ముందు వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.60 కోట్ల ప్రీ - సేల్స్ జరగగా, నార్త్ అమెరికాలో ఏకంగా 4.2 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. ఇది మామూలు రికార్డు కాదు. అయితే ఇప్పుడు సినిమా వాయిదా ప‌డ‌డం తో అన్ని టికెట్లు క్యాన్సిల్ చేసి రీఫండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఓ సినిమా వాయిదా పడటంతో ఇంత భారీ మొత్తాన్ని రీఫండ్ చేయడంతో ఇది కూడా ఓ రికార్డుగా మారింది. మరి ఈ  సినిమాను మళ్లీ ఇంత మంచి డేట్ దొరుకుతుందా ? అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందా ? అన్న సందేహాలు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: