మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా కీలకమైన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విపరీతంగా అంచనాలను పెంచేశాయి. జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ షోలతో పాటు టికెట్ ధరలు కూడా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


రిలీజ్ కి ఒక్కరోజు ముందు అంటే (జనవరి 11) స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రీమియర్ షో టికెట్ ధర విషయానికి వస్తే జీఎస్టీ తో కలుపుకొని రూ. 500 రూపాయలుగా నిర్ణయించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. జనవరి 12వ తేదీ నుంచి 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్ లలో రూ. 100(జీఎస్టీతో) , మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 125(జీఎస్టీతో) కలిపి టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ సర్కార్  జీవోజారి చేసింది. వీటికి తోడుగా ప్రతిరోజు 5 షోలకు కూడా అనుమతి ఇచ్చినట్లు  తెలుస్తోంది.


చివరిగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. కానీ మన శంకరవరప్రసాద్ సినిమా మాత్రం ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని ధీమాతో ఉన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్  డైరెక్టర్ గా పేరు ఉండడం కూడా ఈ సినిమాకి బాగా కలిసివోస్తోంది. అంతేకాకుండా ఎన్నడు లేని విధంగా నయనతార కూడా ఈ సినిమాకి ప్రమోషన్స్ చేయడంతో పాటుగా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో చిరంజీవి కనిపించడంతో ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో అభినవ్ గోమరం, హర్షవర్ధన్, రఘుబాబు, కేథరిన్ తదితర నటినటులు నటిస్తున్నారు ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: