ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ సినిమా టైటిల్ "స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్డు" అని ఒక డిఫరెంట్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్లో విజయ్ సేతుపతి చేతిలో కత్తి పట్టుకుని కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఒక బిచ్చగాడు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నప్పటికీ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి.
హీరోయిన్ ఛార్మి ఈ పోస్టును షేర్ చేస్తు అందులో మక్కల్ సెల్వన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీ అంకిత భావాన్ని చాలా దగ్గరుండి చూడడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంది మీరు చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీగా ఉంటారని తెలియజేస్తే SLUMDOG -33 టెంపుల్ రోడ్డు మనందరికీ ఒక చిరస్మనీయ ప్రాజెక్టు అవుతుంది అంటూ హీరోయిన్ ఛార్మి తెలియజేసింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పైన పూరి, ఛార్మి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి నటీనటుల వ్యవహారం పై చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి