గత ఏడాది నవంబర్ నెలలో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర డియోల్ మరణించగా , నటుడు మరణాంతరం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు.
మలయాళం లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన మమ్ముట్టికి ఇప్పటికి తన సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు.
బాలీవుడ్లో సీనియర్ సింగర్ గా పేరు సంపాదించిన ఆల్కా మాగ్నిక్ కు పద్మభూష అవార్డు ప్రకటించారు.
టాలీవుడ్ విషయానికి వస్తే సీనియర్ హీరో గా, నిర్మాతగా పేరు సంపాదించిన మురళీమోహన్ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
తెలుగు ,తమిళ్ ,బాలీవుడ్ చిత్రాలలో నటించి ఒకప్పుడు హీరోగా భారీ క్రేజీ సంపాదించిన మాధవన్ కి కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అరవిందు వైద్యకు కూడా పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ నటుడు అనిల్ రాస్తోగికి , అలాగే బెంగాల్ నటుడు నిర్మాతగా పేరు పొందిన ప్రోసేన్ జిత్ పద్మశ్రీ అవార్డు వరించింది.
బాలీవుడ్ నటుడు సతీష్ రవిలాల కు మరణాంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
అలా 131 మందికి ఈ పద్మ అవార్డ్స్ లభించాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో లిస్ట్ కూడా వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి