అయితే, ఒక దశలో చిరంజీవి సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం అందరికీ తెలిసిన విషయమే. స్వంతంగా రాజకీయ పార్టీ స్థాపించి, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కొంతకాలం పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన సినీ ఇండస్ట్రీకి చాలా కాలం దూరమయ్యారు. అనంతరం కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేస్తూ, తన అనుభవంతో కూడిన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి సినిమాల్లోకి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్ల పేర్లు తనకు గుర్తు రాలేదని చిరంజీవి స్వయంగా వెల్లడించారట. ముఖ్యంగా కాజల్ అగర్వాల్, తమన్నా వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు విన్నప్పటికీ, వెంటనే గుర్తించలేకపోయానని ఆయన స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
ఈ విషయాన్ని ఆయన సరదాగా ప్రస్తావిస్తూ, వారి గురించి ఇతరులను అడిగి తెలుసుకున్నానని కూడా తెలిపారట. ఇండస్ట్రీకి చాలా రోజుల పాటు దూరంగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చిరంజీవి పేర్కొన్నారు. నిజానికి ఈ వ్యాఖ్యలు ఆయన గతంలోనే చేసినప్పటికీ, ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2025లో ఒక సినిమా ప్రమోషన్స్ సందర్భంగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీని పై కూడా ట్రోలర్స్ ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ లాంటి స్టార్ హీరో నోట ఇలాంటి మాటనా..? అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేకపోతున్నామే అంటున్నారు.
ఇక ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందడమే కాకుండా, సుమారు రూ.350 కోట్ల వరకు వసూలు చేసి భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో వయసు, విరామం అన్నవి చిరంజీవి స్టార్‌డమ్‌కు ఏమాత్రం అడ్డు కావని మరోసారి రుజువైంది.మొత్తానికి, రాజకీయాలు, సినిమాలు – ఏ రంగమైనా సరే, మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలితో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి